ఒక్కడిని కొట్టడానికి వీళ్లంతా ఒక్కటిగా - సీఎం జగన్ *Politics | Telugu OneIndia

2022-10-20 10,406


Chief Minister YS Jagan Mohan Reddy Issues clearance documents of denotified lands from the list of prohibited lands to the farmers at Avanigadda | 22 ఏ (1) సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు క్లియరెన్స్ పత్రాలను సీఎం జగన్ అవనిగడ్డలో అందచేసారు. సామాజిక న్యాయం - సమజాన్ని ముక్కలు చెక్కలు చేసే వాళ్ల మధ్య యుద్దంగా పేర్కొన్నారు. ఈ మోసాలను నమ్మవద్దు..ఈ పేపర్లు చదవద్దు- టీవీలు చూడవద్దని జగన్ పిలుపునిచ్చారు. ఇంట్లో మంచి జరిగిందంటే జగన్ కు తోడుగా నిలవండని సీఎం సూచించారు. నాకు మీ మద్దతు చాలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. చేసిన మంచి చెప్పుకోలేరు. వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బూతులు తిట్టటంలో ఏ స్థాయిలోకి వెళ్లారో చూసామని... వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లు మన నాయకులా అనిపిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని సీఎం సూచించారు.



#YSRCP
#TDP
#AndhraPradesh
#Janasena
#PavanKalyan
#PowerStar
#CMjagan

Videos similaires